For Money

Business News

ఇక వాహనాలకు స్టార్‌ రేటింగ్‌

దేశంలో వాహ‌నాల‌కు స్టార్ రేటింగ్‌లు ఇవ్వనున్నట్లు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గ‌డ్కరీ వెల్లడించారు. వాహనాల భద్రతను సూచించే విధంగా స్టార్‌ రేటింగ్‌ ఇస్తామన్నారు. ఈ రేటింగ్‌ల ద్వారా వినియోగ‌దారుడికి సదరు వాహనం ప్రయాణానికి ఎంత భద్రమో తెలిసిపోతుంది. భార‌త్ ఎన్‌సీఏపీ (భార‌త్ న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్‌)కు సంబంధించిన నమూనా జీఎస్‌ఆర్‌ నోటిఫికేషన్‌కు కేంద్ర రవాణా శాఖ ఆమోదించింది. వాహనాలకు క్రాష్ టెస్టులు నిర్వహించ‌న తరవాత సదరు వాహానానికి స్టార్‌ రేటింగ్‌ ఇస్తారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగునంగా క్రాష్‌ టెస్ట్‌ నిర్వహిస్తామని మంత్రి ట్వీట్‌ చేశారు.