For Money

Business News

పెట్రోల్‌, డీజిల్‌పై ట్యాక్స్‌ సస్పెన్షన్‌

మోటరిస్టుల ప్రయోజనాల కోసం అమెరికా అధ్యక్షుడు జొ బైడెన్‌ కీలక ప్రకటన చేశారు. వచ్చే మూడు నెలల్లో జనం భారీ ఎత్తున హాలిడే కోసం బయట ప్రయాణాలు చేస్తారు. దీంతో రానున్న మూడు నెలలు అంటే 90 రోజుల పాటు పెట్రోల్‌, డీజిల్‌పై కేంద్ర ట్యాక్స్‌ సస్పెండ్‌ చేయాలని కాంగ్రెస్‌ను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ కోరారు. దీన్ని కాంగ్రెస్‌ ఆమోదించిన వెంటనే అమల్లోకి రానుంది. గ్యాలన్‌ (3.78 లీటర్లు) పెట్రోల్‌పై 18 సెంట్లు, డీజిల్‌పై 24 సెంట్ల మేరకు కేంద్రం పన్ను విధిస్తోంది. ఈ పన్నును 90 రోజుల పాటు సస్పెండ్ చేయడంతో…ఆ మేరకు ఇంధన ధరలు తగ్గుతాయి. ఇటీవల మార్కెట్‌లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు భారీగా పెరిగినందున బైడెన్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం అమెరికాలో గ్యాలన్‌ సగటు ధర 5 డాలర్లకు చేరింది. అమెరికాలో ఇంధన ధరలు ఈ స్థాయికి చేరడం ఆ దేశ చరిత్రలో ఇదే మొదటిసారి.