For Money

Business News

32వేల మంది ఉద్యోగులు ఔట్‌

ఆర్ధిక మాంద్యం వస్తుందో లేదో కాని… ఐటీ, టెక్ కంపెనీలు ఉద్యోగులను తొలగించడంలో బిజీగా ఉన్నాయి. అమెరికాలో జులై నాటికి ఏకంగా 32,000 మంది ఉద్యోగుల‌ను తొల‌గించినట్లు క్రంచ్‌బేస్ అనే కంపెనీ వెల్లడించింది. ఉద్యోగులకు ఉద్వాసన పలికిన కంపెనీల్లో మైక్రోసాఫ్ట్‌, మెటా వంటి కంపెనీలు ఉండటం విశేషం. స్టార్టప్‌లు, లిస్టయిన కంపెనీల డేటా ఆధారంగా ఈ వివరాలను సేకరించినట్లు క్రంచ్‌బేస్‌ పేర్కొంది. ఊబర్‌, నెట్‌ఫ్లిక్స్‌తో పాటు పలు క్రిప్టో కరెన్సీ కంపెనీలు కూడా ఉద్యోగులను తొలగించాయి. ఉక్రెయిన్ యుద్ధం, అధిక ధరలు, ఆర్ధిక మంద‌గ‌మ‌నం కారణంగా వ్యాపార అవకాశావలు మందగిస్తామని టెక్‌ కంపెనీలు భావిస్తున్నాయి. ప్రతి వారం మూకుమ్మడి లేఆఫ్‌లు ఉంటున్నాయని… 2022 ఉద్యోగుల‌కు మ‌రో ప్రతికూల ఏడాదిగా మారొచ్చిన టెక్ అన‌లిస్టులు అంటున్నారు. స‌రైన కార‌ణం లేకుండానే పెద్దసంఖ్యలో ఉద్యోగుల‌ను తొలగిస్తున్నానరు. మరోవైపు కొన్ని కంపెనీలు కొత్త ఉద్యోగులను తీసుకోవడం నిలిపివేసినట్లు కూడా క్రంచ్‌ బేస్‌ పేర్కొంది.