For Money

Business News

టాటా నికర లాభం 136% జంప్‌

డిసెంబరు త్రైమాసికంలో టైటన్ కంపెనీ రూ . 987 కోట్ల నికర లాభం ఆర్జించింది. 2020-21 ఇదేకాలం లాభం రూ .530 కోట్లతో పోలిస్తే ఇది 136 శాతం అధికం. కంపెనీ రూ. 847 కోట్ల నికర లాభం ప్రకటిస్తుందని మార్కెట్‌ అంచనా వేసింది. కంపెనీ ఆదాయం రూ.7.659 కోట్ల నుంచి రూ .10,094 కోట్లకు చేరుకుంది. అక్టోబరు , నవంబరు నెలల్లో పండగల కొనుగోళ్లతో ఆభరణాల వ్యాపారం 37 % వృద్ధితో రూ.8,563 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. గత ఏడాదితో పోలిస్తే కంపెనీ ఆపరేటింగ్‌ మార్జిన్‌ 2.9 శాతం పెరిగి 14.7 శాతానికి చేరింది.