For Money

Business News

స్థిరంగా ప్రారంభం కానున్న నిఫ్టి

రాత్రి అమెరికా మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. ముఖ్యంగా ఫేస్‌బుక్‌ దెబ్బకు నాస్‌డాక్‌ 3.74 శాతం నష్టంతో ముగిసింది. ఎస్‌ అండ్‌ పీ 500 సూచీ 2.44 శాతం, డౌజోన్స్‌ 1.45 శాతం నష్టంతో ముగిసింది. ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు నష్టాల్లో ఉన్నాయి. చైనా మార్కెట్లు ఈ వారమంతా సెలవులు కారణంగా పనిచేయడం లేదు. సోమవారం నుంచి సెలవుల్లో ఉన్న హాంగ్‌సెంగ్‌ 2.3 శాతం లాభంతో ట్రేడవుతోంది.జపాన్‌ క్రితం ముగింపు వద్దే ట్రేడవుతోంది. న్యూజిల్యాండ్‌ సూచీ 0.68 శాతం నష్టంతో ఉంది. ఆస్ట్రేలియా స్వల్ప నష్టాలతో ఉంది. సింగపూర్ నిఫ్టి 65 పాయింట్ల లాభంతో ఉంది. ఈ లెక్కన నిఫ్టి గ్రీన్‌లో ప్రారంభం కావొచ్చు.