For Money

Business News

వాల్‌స్ట్రీట్‌లో టెక్‌ షేర్ల జోరు

రాత్రి అమెరికా మార్కెట్లు కొత్త ఏడాది బంపర్‌ లాభాలతో ప్రారంభమయ్యాయి. కరెన్సీ మార్కెట్‌లో డాలర్ 30 రోజల గరిష్ఠ స్థాయికి చేరగా.. బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ 79 డాలర్లను దాటింది. ఒక షేర్‌ మార్కెట్‌లో జోష్‌ జోరుగా కన్పించింది. ముఖ్యంగా నాస్‌డాక్‌ 1.2 శాతం లాభంతో ముగిసింది. టెక్‌, ఐటీ షేర్లకు మంచి డిమాండ్‌ లభించింది. చాలా రోజుల తరవాత టెస్లా ఆకర్షణీయ లాభాలతో ముగిసింది. అయితే ఇదే ఉత్సాహం ఆసియాలో కన్పించడం లేదు. సెలవుల తరవాత ప్రారంభమైన జపాన్‌ నిక్కీ ఒక శాతం పైగా లాభంతో ఉన్నా… హాంగ్‌కాంగ్‌తో సహా చైనా మార్కెట్లు నష్టాల్లో ఉన్నాయి. హాంగ్‌కాంగ్‌ నష్టాలు స్వల్పంగా ఉన్నాయి. సింగపూర్‌ నిఫ్టి స్థిరంగా ఉంది. నిఫ్టి కూడా స్థిరంగా ప్రారంభం కానుంది.