వైజాగ్ స్టీల్ టేకోవర్‌కు టాటా స్టీల్ సై
వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను టేకోవర్ చేసేందుకు తాము సిద్ధమేనని టాటా స్టీల్ స్పష్టం చేసింది. తీర ప్రాంతంలో ముఖ్యంగా తూర్పు తీరంలో.. దక్షిణాదిలో ఉన్న ఈ స్టీల్ ప్లాంట్‌కు అద్భుత అవకాశాలు ఉన్నాయని ఆ కంపెనీ సీఈఓ టీవీ నరేంద్రన్ అన్నారు. పీటీఐ వార్తా సంస్థతో ఆయన మాట్లాడుతూ…తీర ప్రాంతంలో ఉన్న ఏకైక ఇంటెగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఒక్కటేనని ఆయన అన్నారు. దాదాపు 22,000 ఎకరాలతోపాటు గంగవరం పోర్టు దగ్గర్లోనే ఉండటంతో ముడి సరుకుల దిగుమతి కూడా చాలా సులభం. ఒడిశాలోని నీలాచల్ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ టేకోవర్‌కు కూడా తాము ఆసక్తి వ్యక్తీకరణ పత్రం (Expression of Interest) ఇచ్చినట్లు నరేంద్రన్ తెలిపారు.