For Money

Business News

టాటా నెక్సాన్‌ ఈవీలో మంటలు

టాటా మోటార్స్‌ ఇప్పటి వరకు దాదాపు 30,000 టాటా నెక్సాన్‌ ఎలక్ట్రిక్‌ వాహనాలను విక్రయించింది. తొలిసారి
ముంబైలో టాటా నెక్సాన్ ఈవీ కారు అగ్ని ప్రమాదానికి గురైంది. ఇప్పటి వరకు ఈవీలలో టూవీలర్స్‌కు మాత్రమే అగ్ని ప్రమాదాలు జరుగుతూ వచ్చాయి.. ఇపుడు ఫోర్‌ వీలర్లకు మంటలు రావడంతో ఈ వాహనాల భద్రతపై చర్చ మొదలైంది. ముంబైలో నెక్సాన్ కారులో ఉన్నట్టుండి మంటలంటు కున్నాయని అంటున్నారు. ఈ మంటలతో కారు దాదాపు పూర్తిగా దగ్ధమైపోయింది. ఈ అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. విషయం తెలిసిన వెంటనే టాటా మోటార్స కంపెనీ సదరు కాలిపోయిన నెక్సాన్‌ను తెప్పించి పూణెలోని టాటా ఆర్‌ అండ్‌ డీ కేంద్రానికి తరలిస్తోంది. అలాగే నెక్సాన్‌ అగ్నిప్రమాదం ఘటనపై దర్యాప్తు ప్రారంభించినట్టు టాటా మోటార్స్‌ వెల్లడించింది.