For Money

Business News

మార్కెట్‌లోకి టాటా ఏస్‌ EV

టాటా మోటార్స్ ఇవాళ ఏస్ మినీ ట్రక్ .. ఎలక్ట్రిక్ వెర్షన్‌ మార్కెట్‌లోకి విడుదల చేసింది. ప్రముఖ ఈ – కామర్స్ సంస్థలైన అమెజాన్, బిగ్ బాస్కెట్, సిటీ లింక్, డాట్, ఫ్లిప్‌కార్ట్, లెట్స్ ట్రాన్స్‌పోర్ట్‌ వంటి కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్న టాటా మోటార్స్లతో టాటా మోటార్స్‌ ఒప్పందం చేసుకుంది. వీటికి 39000 ఈవీ వాహనాల సరఫరా కోసం కంపెనీకి ఆర్డర్లు వచ్చాయి. అయితే ఈ వాహనం ధరను కంపెనీ ప్రకటించలేదు. జూలై నుంచి డెలివరీలు ప్రారంభమౌతాయి. సింగిల్ ఛార్జ్‌తో 154 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. పాసింజర్ కార్లు, బస్సులను సైతం ఎలక్ట్రిక్‌గా మారుస్తున్నామని టాటా గ్రూప్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ఈ సందర్భంగా అన్నారు.