For Money

Business News

వచ్చే నెలలో టీ హబ్‌-2 ప్రారంభం

స్టార్టప్‌లను మరింత ప్రోత్సహించేందుకు గాను తెలంగాణ ప్రభుత్వం రెండో దశ టీ హబ్‌ నిర్మాణాన్ని చేపట్టింది. ఇపుడు గచ్చిబౌలిలోని ట్రిబుల్‌ ఐటీలో టీ హబ్‌ ఉంది. అయితే స్థలం సరిపోకపోవడంతో కొత్తగా విశాలమైన ప్రాంగణమైన మాదాపూర్‌-రాయదుర్గంలోని నాలెడ్జ్‌ సిటీలో 3.5లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో టీ హబ్‌2ను నిర్మించారు. ప్రసుత్తం దీని నిర్మాణం పూర్తి కావడంతో వచ్చే నెలలో ప్రారంభించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. విదేశీ పర్యటనలో ఉన్న రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ వచ్చిన తర్వాత టీహబ్‌-2 ప్రారంభంపై నిర్ణయం తీసుకోనున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మితమైన టీహబ్‌-2 ప్రపంచంలోనే అతి పెద్ద స్టార్టప్‌ ఇంక్యుబేషన్‌ సెంటర్‌గా మారనుంది. ఇక్కడ ఒకేసారి 1,500 స్టార్టప్‌లు తమ కార్యకలాపాలను నిర్వహించేందుకు అవసరమైన మౌలిక వసతులను, పరిపాలన వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు.