For Money

Business News

సిర్మ ఎస్‌జీఎస్‌ టెక్నాలజీ ఐపీఓ సక్సెస్‌

ఎలక్ట్రానిక్‌ సిస్టమ్‌ డిజైన్‌, తయారీ రంగానికి చెందిన సిర్మ సీఎజీఎస్‌ టెక్నాలజీ పబ్లిక్‌ ఇష్యూకు ఇన్వెస్టర్ల నుంచి విశేష ఆదరణ లభించింది. ఈ ఇష్యూ 32.61 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రయిబ్‌ అయింది. 2.85 కోట్ల షేర్లను కంపెనీ ఆఫర్‌ చేయగా.. 93.14 కోట్ల షేర్లకు దరఖాస్తులు వచ్చాయి. ఈనెల 11న అంటూ పబ్లిక్‌ ఆఫర్‌ ప్రారంభానికి ఒక రోజు ముందు యాంకర్‌ ఇన్వెస్టర్ల నుంచి రూ. 252 కోట్లను కంపెనీ సమీకరించింది. దీంతో పబ్లిక్ ఆఫర్‌ సైజ్‌న 3.81 కోట్ల షేర్ల నుంచి 2.85 కోట్ల షేర్లకు తగ్గించింది. ఇష్యూలో క్వాలిఫైడ్‌ ఇన్వెస్టర్లకు సంబంధించిన విభాగం 87.56 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రయబ్‌ అయింది. అలాగే నాన్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్లకు కేటాయించిన షేర్ల విభాగం 17.5 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రయిబ్‌ అయింది. రిటైల్‌ ఇన్వెస్టర్ల నుంచి మాత్రం 5.53 రెట్ల స్పందన లభించింది.