For Money

Business News

చెరకు గిట్టుబాటు ధర పెంపు

ప్రస్తుత చక్కెర సీజన్‌ అంటే 2022-23 సీజన్‌కు చెరకు గిట్లుబాటు ధర Fair and Remunerative Price (FRP)ను పెంచుతూ కేంద్ర కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది.ఈ ఏడాది అక్టోబర్‌ నుంచి వచ్చే ఏడాది సెప్టెంబర్‌ వరకు ఈ సీజన్‌ ఉంటుంది. క్వింటర్‌ చెరకు FRPను రూ.15 పెంచాలని కేబినెట్‌ నిర్ణయించిది. దీంతో క్వింటాలు చెరకు ధర రూ. 290 నుంచి రూ. 305కు పెరిగింఇ.10.25 శాతం కంటే ఎక్కువ రికవరీ ఉంటే ప్రతి 0.1 శాతం రికవరీకి అదనంగా క్వింటాలుకు రూ.3.05 అధికంగా చెల్లిస్తారు. ఒకవేళ రికవరీ శాతం 9.5 శాతం కంటే తక్కువ ఉంటే మాత్రం క్వింటాలు చెరకుకు రూ.282 చెల్లిస్తారు. ఈ శాతం కంటే రికవరీ శాతం ఎంత తక్కువ ఉన్నా ఈ ధర ఇవ్వాల్సి ఉంటుంది. క్వింటాలుకు కేవలం రూ. 15 పెంచడంపై రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.