For Money

Business News

బలంగా, బలహీనంగా ఉన్న షేర్లు

మూమెంటమ్‌ను సూచించే మూవింగ్ యావరేజ్‌ కన్వర్జెన్స్‌ డైవెర్జెన్స్ (MACD)ను బట్టి చూస్తే కొన్ని షేర్లలో బుల్లిష్‌ ట్రేడ్ సెటప్ కన్పిస్తుంది. అవి.. గోద్రెజ్‌ ఇండస్ట్రీస్‌, ఇండియా మార్ట్‌, వర్ల్‌పూల్ ఇండియా, పేజ్‌ ఇండస్ట్రీస్‌, దేవయాని ఇంటర్నేషనల్‌, ఈఐడీ ప్యారీ. సాధారణంగా షేర్‌ లేదా సూచీలో ట్రెండ్‌ రివర్సల్‌ను MACD సూచిస్తుంది. సిగ్నల్‌ లైన్‌ను MACD దాటితే సదరు షేర్‌ పెరుగుతుంది. అదే సిగ్నల్‌ లైన్‌ దిగువకు వస్తే బేరిష్‌ ధోరణి కన్పిస్తుంది. కొన్ని షేర్లలో బేరిష్‌ ధోరణి కన్పిస్తోంది. ఆ షేర్లు… కొచిన్‌ షిప్‌యఆర్డ్‌, సీక్వెంట్‌ సైంటిఫిక్‌, మహీంద్రా లాజిస్టిక్‌, అలెంబిక్‌ ఫార్మా, లక్స్‌ ఇండస్ట్రీస్‌.
ఇక వాల్యూ (విలువ) పరంగా చాలా యాక్టివ్‌గా ఉన్న షేర్లలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, హిందాల్కో, అదానీ పవర్ ముందున్నాయి. అదే వాల్యూమ్‌ (ట్రేడింగ్ పరిమాణం) ఆధారంగా చూస్తే వోడాఫోన్‌ ఐడి, పారాదీప్‌ ఫాస్ఫేట్స్‌, ఓఎన్‌జీసీ, సుజ్లాన్‌ ఎనర్జి, ఎస్ బ్యాంక్‌, సెయిల్‌ ముందున్నాయి.
52 వారాల గరిష్ఠ స్థాయిని దాటిన బ్లూ డార్ట్‌ షేర్‌లో కొనుగోలు ఆసక్తి కన్పిస్తోంది. అదే పరిమల్‌ ఎంటర్‌ప్రైజెస్‌, ముత్తూట్‌ ఫైనాన్స్‌, సుందరం ఫైనాన్స్‌, నెస్కో, ఇప్కా ల్యాబ్స్‌, 3ఎం ఇండియా షేర్లలో భారీ అమ్మకాల ఒత్తిడి కన్పిస్తోంది. ఇవి 52 వారాల కనిష్ఠ స్థాయిలకు దిగువన ట్రేడవుతున్నాయి.