For Money

Business News

ఇవాళ ఈ షేర్లను గమనించండి

ఇవాళ మార్కెట్‌లో బాగా ప్రభావితం చేసే షేర్లలో పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్, పేటీఎం, జొమాటో, ఐటీసీ ఉన్నాయి.

పేటీఎం (One 97 Communications )బోర్డు నుంచి సాఫ్ట్‌ బ్యాంక్‌ ప్రతినిధి అయిన మునీష్‌ వర్మ నిన్న రాజీనామా చేశారు. ఆయన కంపెనీలో నాన్‌ ఇండిపెండెంట్‌గా ఉన్నారు.
పీఎన్‌బీ: కొత్త మరో రూ. 2060 కోట్ల రుణం ఎన్‌పీఏగా మారడంతో ఈ షేర్‌లో ఒత్తిడి రావొచ్చు.
జొమాటొ: ముకుంద ఫుడ్స్‌లో 16.66 శాతం వాటాను జొమాటొ కొనుగోలు చేసింది. ఫుడ్ రొబోటిక్‌ కంపెనీ అయిన దీనిని 50 లక్షల డాలర్లకు కొనుగోలు చేసింది. అలాగే గ్రోఫర్స్‌కు 15 కోట్ల డాలర్ల రుణం ఇచ్చేందుకు కూడా అంగీకరించింది.

శ్యామ్‌ మెటాలిక్స్‌ అండ్ ఎనర్జీ షేర్‌లో కూడా ప్రైస్‌ యాక్షన్‌ ఉండొచ్చు. కంపెనీ తన వార్షిక సామర్థాన్ని మరో 2.85 మిలియన్‌ టన్నులు పెంచాలని నిర్ణయించింది. దీని కోసం రూ. 990 కోట్లను వెచ్చించనుంది.
జెనస్‌ పేపర్‌: కంపెనీకి యూపీలోని ముజఫర్‌ నగర్‌లో కొత్త యూనిట్‌ ప్రాంభమైంది. డూప్లిక్స్‌ పేపర్‌ తయారీ కోసం దీన్ని నెలకొల్పారు.
ఐటీసీ: మదర్‌ స్పర్శ్‌ బేబీ కేర్‌ కంపెనీకి చెందిన 1040 కంపల్సరీ కన్వర్టబుల్‌ షేర్లను కంపెనీ కొనుగోలు చేసింది. దీంతో కంపెనీలో ఐటీసీ షేర్‌ 16 శాతానికి చేరింది.
ఇక బ్రోకరేజి సంస్థలు టెక్‌ మహీంద్రా, డీఎల్‌ఎఫ్‌, శోభా, ఇన్ఫోసిస్‌, టాటా పవర్‌ షేర్ల కొనుగోలుకు సిఫారసు చేస్తున్నారు.