For Money

Business News

అమెజాన్‌ చేతికి ఎంజీఎం

హాలివుడ్‌లో పాత తరం సినిమా స్టూడియోల్లో ఒకటైన ఎంజీఎంను అమెజాన్‌ టేకోవర్‌ చేయనున్నట్లు ఇది వరకే ప్రకటించింది. తాజాగా ఈ డీల్‌కు యూరోపియన్‌ యూనియన్‌ ఆమోదం తెలిపింది. 845 కోట్ల డాలర్లకు ఎంజీఎంను అమెజాన్‌ టేకోవర్‌ చేయనుంది. పాత స్టూడియో అని, ఆ స్టూడియో టేకోవర్‌తో మార్కెట్‌ పోటీ తగ్గే అవకాశం లేదని యూరోపియన్‌ యూనియన్‌ అధికారులు తెలిపారు. తమ వీడియో స్ట్రీమింగ్‌ వ్యాపారం కోసం ఈ డీల్‌ చేసుకున్నామని… అలాగే ఆ స్టూడియోకు చెందిన సినిమాల ఆధారంగా కొత్త సినిమాలు తీయడం లేదా షోలు చేస్తామని అమెజాన్‌ పేర్కొంది.