For Money

Business News

నష్టాల్లో లిస్టయిన స్టార్‌ హెల్త్‌

స్టార్‌ షేర్‌ బ్రోకర్‌ రాజేష్‌ ఝున్‌ ఝున్‌ వాలా వాటా కలిగి ఉన్న స్టార్‌ హెల్త్‌ అండ్‌ అల్లాయిడ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ నష్టాలతో లిస్టయింది. కంపెనీ ప్రమోటర్ల దురాశ కారణంగా ఇన్వెస్టర్లు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ ఇష్యూలో రీటైల్‌ ఇన్వస్టర్ల కోటా పూర్తి కాలేదు. ఉద్యోగులు దరఖాస్తు చేయలేదు. అయినా కంపెనీ దరఖాస్తు చేసినవారి నుంచి ముక్కుపిండి రూ. 900 వసూలు చేసింది. ఇవాళ ఎన్‌ఎస్‌ఈలో ఈ షేర్‌ రూ.845 వద్ద లిస్టయి.. వెంటనే రూ. 828కి చేరింది. ఇదే ధర వద్ద కూడా ఉద్యోగులు దరఖాస్తు చేయలేని విషయం తెలిసిందే. తరవాత కోలుకుని రూ. 940ని తాకిందే కాని.. ఇపుడు రూ. 900 వద్ద అంటే ఇష్యూ ధర వద్దే ట్రేడవుతోంది.మరి కనీసం ఇదే ధర వద్ద ఈ షేర్‌ నిలబడుతుందేమో చూడాలి.