For Money

Business News

మెట్రో బ్రాండ్స్‌ ఇష్యూ నేడే… దరఖాస్తు చేయొచ్చా?

దేశంలోని ప్రముఖ ఫుట్‌వేర్‌ బ్రాండ్లలో ఒకటైన మెట్రో బ్రాండ్స్‌ పబ్లిక్‌ ఇష్యూ ఇవాళ ప్రారంభం అవుతోంది. 14న ముగుస్తుంది. రూ. 5 ముఖ విలువ గల ఈ షేర్‌ ధరశ్రేణి రూ. 485- రూ.500. యాంకర్‌ ఇన్వెస్టర్ల నుంచి రూ 510 కోట్లను సమీకరించిన మెట్రో బ్రాండ్‌…ఈ ఇష్యూ ద్వారా రూ. 1,367 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. ఈనెల 22న ఈ షేర్‌ లిస్ట్‌ కానుంది. కనీసం 30 షేర్లకు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. అంటే దరఖాస్తు సొమ్ము రూ.15,000 గరిష్ఠంగా 13 లాట్లకు అంటే రూ. 1,95,000 అవసరం. ఈ ఆఫర్‌ను సబ్‌స్క్రయిబ్‌ చేయమని ఐడీబీఐ క్యాపిటల్‌ సిఫారసు చేస్తోంది. వెంటనే ఈ ఇష్యూకు లాభాలు వస్తాయా అన్న అంశంపై భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఇపుడు గ్రే మార్కెట్‌లో అంటే అనధికార మార్కెట్‌లో రూ.40 ప్రీమియం లభిస్తోంది. ఏంజిల్‌ వన్‌ షేర్‌ బ్రోకర్‌ సంస్థ మాత్రం ఈ ఇష్యూ వల్ల వెంటనే లాభాలు వస్తాయా అన్నది అనుమానమే అని అంటోంది. బాటా,రిలాక్సొ ఫుట్‌వేర్‌ వంటి కంపెనీలు ఈ రంగంలో తక్కువే ఉన్నాయి. కాబట్టి ఈ షేర్‌ దీర్ఘకాలంలో మంచి ప్రతిఫలం ఇస్తుందని మరికొందరు బ్రోకర్లు అంటున్నారు.