For Money

Business News

మరో రూ.550 పెరిగిన వెండి

అంతర్జాతీయ మార్కెట్‌లో వరుసగా రెండో రోజు కూడా బులియన్‌కు మద్దతు కొనసాగుతోంది. ప్రధానంగా 1700 డాలర్లకు దిగువ బంగారానికి గట్టి సపోర్ట్ వచ్చింది. అమెరికా వడ్డీ రేట్ల పెంపుపై సస్పెన్స్‌ తొలగడంతో బులియన్‌కు మద్దతు వచ్చింది. ముఖ్యంగా వెండి పరుగులు పెడుతోంది. నిన్న రాత్రి 7 శాతం దాకా పెరిగిన వెండి ఇవాళ మరో రెండు శాతంపైగా పెరిగింది. అలాగే బంగారం కూడా అర శాతంపైగా పెరిగింది. ఎంసీఎక్స్‌లో స్టాండర్డ్‌ బంగారం ఆగస్టు కాంట్రాక్ట్‌ రూ. 200 దాకా పెరిగి రూ. 51500లకు చేరింది. ఇక వెండి సెప్టెంబర్‌ కాంట్రాక్ట్‌ రూ. 541 పెరిగి రూ. 58160 వద్ద ట్రేడవుతోంది. అంతకుమునుపు రూ. 58239ని కూడా తాకింది. అమెరికా మార్కెట్లు ప్రారంభం వరకు ఈ ట్రెండ్‌ కొనసాగే అవకాశముంది. ఫార్వర్డ్‌ మార్కెట్‌లో వెండికి రూ. 58565 ప్రాంతంలో అమ్మకాల ఒత్తిడి రావొచ్చు. అలాగే బంగారానికి రూ.51592 లేదా రూ. 51666 వదద్ద అమ్మకాల ఒత్తిడి రావొచ్చు.