For Money

Business News

17100పైన ప్రారంభమైన నిఫ్టి

నిఫ్టి ఓపెనింగ్‌లోనే 17100 స్థాయిని దాటింది. క్రితం ముగింపుతో పోలిస్తే 164 పాయింట్ల లాభంతో ఇపుడు 17094 వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్‌ 596 పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది. ఫైనాన్స్‌ షేర్లు భారీ లాభాలతో ట్రేడవుతున్నాయి. బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలతో పాటు లైఫ్‌ ఇన్సూరెన్స్‌ షేర్లు ఇవాళ వెలుగులో ఉన్నాయి. డాక్టర్‌ రెడ్డీస్‌ ఫలితాలకు మార్కెట్‌ నెగిటివ్‌గా స్పందించింది.దీంతో షేర్‌ 4 శాతం నష్టంతో రూ.4096 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఇవాళ నిఫ్టి కేవలం మూడు షేర్లు నష్టాల్లో ఉన్నాయి. డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్, సన్‌ ఫార్మా, దివీస్‌ ల్యాబ్‌.. మూడూ నష్టాల్లో ఉన్నాయి. అయితే మిగిలిన రెండు షేర్ల నష్టాలు నామమాత్రమే. ఏ క్షణమైనా ఈ రెండు షేర్లు లాభాల్లోకి రావొచ్చు. ఎస్‌బీఐ లైఫ్‌ టాప్‌ గెయినర్‌ కాగా, బజాజ్‌ ట్విన్స్‌ ఇవాళ కూడా టాప్‌ గెయినర్స్‌గా ఉన్నాయి. బజాజ్‌ ఫైనాన్స్‌, బజాజ్‌ ఫిన్‌ సర్వ్‌ షేర్లు నిన్న పది శాతం లాభంతో క్లోజ్‌ కాగా, ఇవాళ మరో రెండు శాతం పెరిగాయి. టాటా స్టీల్‌ కూడా రెండు శాతం పెరిగింది. బజాజ్‌ హోల్డింగ్స్‌ 5 శాతం లాభంతో ట్రేడవుతోంది. ఎస్‌బీఐ కార్డ్స్‌, డీఎల్‌ఎఫ్‌ కూడా ఆకర్షణీయ లాభాలతో ఉన్నాయి.