For Money

Business News

అంతర్జాతీయ బులియన్‌ ఎక్స్ఛేంజి నేడు ప్రారంభం

మరో వ్యాపార సంస్థ గుజరాత్‌కు వెళ్ళింది. ఆర్థిక రాజధాని లేదా దేశ రాజధాని కాదని గుజరాత్‌లో మనదేశపు తొలి ఇండియా అంతర్జాతీయ బులియన్‌ ఎక్స్ఛేంజ్‌ (Indiai International Bullion Exchange -IIBX)ను  ఇవాళ ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. ఇవాళ్టి నుంచి ప్రధాని గుజరాత్‌ పర్యటిస్తున్నారు. గాంధీనగర్‌లోని గుజరాత్ ఇంటర్నేషనల్‌ ఫైనాన్స్‌ టెక్‌ సిటీ (గిఫ్ట్‌ సిటీ)లో ప్రారంభించనున్నారు. షేర్‌ మార్కెట్‌లో మాదిరిగానే బంగారం స్పాట్‌ డెలివరీ కాంట్రాక్ట్‌తో పాటు బులియన్‌ డిపాజిటరీ రిసీట్స్‌ను ఈ ఎక్స్ఛేంజీ ఆఫర్‌ చేస్తుంది. ఎలాగైతే కమాడిటీ మార్కెట్‌లో ఆహార, వాణిజ్య వస్తువుల ఆధారంగా ట్రేడింగ్ జరుగుతుందో అలాగే బులియన్‌ ఆధారంగా ఇక్కడ ట్రేడింగ్‌ జరుగుతుంది. సాధారణ బులియన్‌కు భిన్నంగా ఈ ఎక్స్ఛేంజీలో బంగారం వెండి కొనుగోళ్ళతో పాటు డెరివేటివ్స్‌ ట్రేడింగ్‌ కూడా ఉంటుంది. ఈ ఎక్స్ఛేంజీని ఇంటర్నేషనల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ సెంటర్స్‌ అథారిటీ నిర్వహిస్తుంది. సింపుల్‌గా చెప్పాలంటే.. బంగారం, వెండి ఆధారంగా స్పెక్యులేటివ్‌ ట్రేడింగ్‌కు వీలు కల్గుతుంది. బంగారం, వెండిలో స్పాట్‌తోపాటు ఫ్యూచర్స్‌, ఆప్షన్స్‌ కూడా ఈ ఎక్స్ఛేంజీలో ట్రేడవుతాయన్నమాట.