For Money

Business News

రూ. 2000 పెరిగిన వెండి

అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ ఉద్దీపన ప్యాకేజీకి మద్దతు తగ్గిస్తూ నెలకు 1500 కోట్ల డాలర్లకు బదులు 3000 కోట్ల డాలర్ల బాండ్లను వెనక్కి తీసుకుంటామని ప్రకటించడంతో అంతర్జాతీయ మార్కెట్‌ డాలర్ అరశాతం వరకు తగ్గింది. దీంతో మున్ముందు వాస్తవ వడ్డీరేట్లు పెరిగే అవకాశం ఉండటంతో బులియన్‌కు డిమాండ్‌ పెరిగింది. స్పాట్‌ మార్కెట్‌లో పది గ్రాముల బంగారం ధర రూ. 440 పెరిగినా… అప్పటికే దుకాణాలు మూతపడటంతో కొత్త ధరలు ఇంకా అమల్లోకి రాలేదు. అలాగే స్పాట్‌ మార్కెట్‌లో వెండి ఒక మోస్తరు లాభాలతో ముగిసింది. కాని ఫ్యూచర్స్‌ మార్కెట్‌లో ఇంకా ట్రేడింగ్‌ సాగుతోంది. వెండిన నాలుగున్నర శాతంపైగా లాభపడగా, బంగారం దాదాపు రెండు శాతం లాభ పడింది. డాలర్ పడటంతో రూపాయి కాస్త బలపడినట్లే. అయినా ఫ్యూచర్ మార్కెట్‌లో ఫిబ్రవరి బంగారం కాంట్రాక్ట్‌ రూ.549 పెరిగి రూ. 48636 వద్ద ట్రేడవుతోంది. ఇక వెండి మార్చి కాంట్రాక్ట్‌ రూ. 2023 పెరిగి రూ. 62,231 వద్ద ట్రేడవుతోంది.