For Money

Business News

మరింత కరిగిన వెండి ధర

అంతర్జాతీయ మార్కెట్‌లో బులియన్‌ ధరలు బాగా తగ్గినా.. మన మార్కెట్‌లో పెద్దగా తగ్గడం లేదు. ఎందుకంటే గత కొన్ని నెలలుగా డాలర్‌ పెరుగుతున్నా… రూపాయి స్థిరంగా ఉంది. కాని ఇపుడు డాలర్‌తో రూపాయి బలహీనపడటంతో… బులియన్‌ ధరల్లో పెద్ద మార్పు కన్పించడం లేదు. అయితే బంగారంతో పోలిస్తే వెండి ధర అంతర్జాతీయ మార్కెట్‌లో భారీగా క్షీణిస్తోంది. దీనికి కారణం మాంద్యం కారణంగా పారిశ్రామిక ఉత్పత్తి తగ్గుతుందని భావిస్తున్నారు. వెండి అనేక పరిశ్రమల్లో ఉపయోగిస్తున్నారు. దీంతో బంగారం కన్నా వెండి ధర అధికంగా క్షీణిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్‌ బంగారం ధర ఇవాళ 0.55 శాతం తగ్గి 1646 డాలర్ల వద్ద ఉంటోంది. ఇక వెండి మాత్రం 1.65 శాతం తగ్గి 18.56 డాలర్ల వద్ద ఉంది. దీంతో మన దగ్గర ఫార్వర్డ్‌ మార్కెట్‌లో వెండి బాగా తగ్గింది. ఎంసీఎక్స్‌లో కిలో వెండి నవంబర్‌ కాంట్రాక్ట్‌ ప్రస్తుతం రూ.56,161 వద్ద ట్రేడవుతోంది. నిన్నటి ధరతో పోలిస్తే రూ.580 తగ్గింది. బంగారం ధర మాత్రం రూ.12 తగ్గి రూ. 49,389 వద్ద ట్రేడవుతోంది.
స్పాట్‌ మార్కెట్‌లో…
రూపాయి బలహీనపడటం వల్ల స్పాట్‌ మార్కెట్‌లో బులియన్‌ ధరల్లో పెద్ద మార్పు లేదు. సెప్టెంబర్ 17వ తేదీన 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.45,950 ఉండగా.. ఇవాళ ధర రూ.46,000గా ఉంది. 24 క్యారెట్ల బంగారం రూ. 50,200 వద్ద ఉంటోంది.