For Money

Business News

17100 దిగువకు నిఫ్టి

సింపూర్ నిఫ్టి స్థాయిలో నిఫ్టి ప్రారంభమైనా… కొన్ని నిమిషాల్లోనే నిఫ్టి 17100 దిగువకు పడిపోయింది. 17072 పాయింట్లు తాకిన తరవాత ఇపుడు 17130 వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 197 పాయింట్ల నష్టంతో ట్రేడవుతోంది. ఎఫ్‌ఎంసీజీ షేర్లు మినహా ఇతర రంగాల షేర్లపై ఒత్తిడి పెరుగుతోంది. నిఫ్టిలో 44 షేర్లు నష్టాల్లో ఉన్నాయి. ఇతర రంగాల షేర్లలపై భారీ అమ్మకాల ఒత్తిడి రావడంతో దాదాపు అన్నిరంగాల సూచీలు 1.5 శాతంపైగా నష్టంతో ట్రేడవుతున్నాయి. నిఫ్టి మిడ్‌ క్యాప్‌ సూచీ ఏకంగా రెండు శాతం నష్టపోయింది. ఫార్మా షేర్లు పరవాలేదనిపిస్తోంది. ఇక నిఫ్టి షేర్లలో హెచ్‌యూఎల్‌, బీపీసీఎల్‌, నెస్లే, బజాజ్‌ ఫిన్‌ సర్వ్‌, బ్రిటానియా షేర్లు గ్రీన్‌లో ఉన్నాయి. అయితే ఒక్క షేర్‌ కూడా ఒక శాతం మించి లాభపడలేదు. అయితే నిఫ్టిలో పవర్‌ గ్రిడ్‌ నాలుగు శాతంపైగా క్షీణించగా, హిందాల్కో మూడు శాతంపైగా పడింది. అదానీ గ్రూప్‌ షేర్లపై ఒత్తిడి పెరుగుతోంది. నిఫ్టి బ్యాంక్‌లో 12 షేర్లు ఉండగా.. అన్నీ నష్టాల్లో ఉన్నాయి. మూడు శాతంపైగా క్షీణించిన బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా టాప్‌ లూజర్‌గా నిలిచింది.