For Money

Business News

వెండి రూ. 2,400 డౌన్‌

అంతర్జాతీయ మెటల్‌ మార్కెట్‌లో వచ్చిన ర్యాలీకి బ్రేక్‌ పడింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్‌ బంగారం 1650 డాలర్ల నుంచి నుంచి 1740 డాలర్ల వరకు పెరిగిన బంగారం ఇవాళ ఒక శాతం దాకా తగ్గి 1716 డాలర్లకు చేరింది. అయితే భారీగా పెరిగిన వెండి అంతే భారీగా పడింది. మొన్న ఏడు శాతం పెరిగిన వెండి ఇవాళ 5 శాతం దాకా క్షీణించింది. ఇపుడు 20.17 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. దసరా సందర్భంగా ఇవాళ ఈక్విటీ మార్కెట్లకు సెలవు. అయితే కమాడిటీ మార్కెట్లలో తొలి సెషన్‌కు సెలవు కాగా, రెండో సెషన్‌లో ట్రేడింగ్‌ నడుస్తోంది. డాలర్ పెరగడంతో బులియన్‌ మార్కెట్‌ బాగా రియాక్ట్ అవుతోంది. ఫ్యూచర్స్‌ మార్కెట్‌ విషయానికొస్తే… ఎంసీఎక్స్‌లో పది గ్రామలు బంగారం డిసెంబర్‌ కాంట్రాక్ట్‌ రూ. 250 తగ్గి రూ. 51560 వద్ద ట్రేడవుతోంది. టెక్నికల్‌ అనాలిసిస్‌ ప్రకారం ఇక్కడి నుంచి బంగారం బలహీనపడి రూ. 51062ని తాకిన, దాని దిగువకు వచ్చినా అమ్మకాల ఒత్తిడి అధికంగా ఉంది. ఆ తరవాత రూ. 50,919 వద్ద ఒత్తిడి అధికం కావొచ్చు. రూ. 50700 గట్టి మద్దతు స్థాయి. ఈ స్థాయిని కోల్పోతే మాత్రం బంగారానికి రూ. 49,994 వరకు మద్దతు లేదు.
వెండిలో భారీ నష్టం.
ఇక వెండి ఎలా పెరిగిందో.. అలా పడుతోంది. కిలో వెండి ఎంసీఎక్స్‌లో రూ.2000లకుపైగా క్షీణించింది. కిలో వెండి డిసెంబర్‌ కాంట్రాక్ట్‌ రూ.2400 క్షీణించి రూ. 59,458 వద్ద ట్రేడవుతోంది. టెక్నికల్స్‌ విషయానికొస్తే ఇవాళ్టికి వెండి కీలక మద్దతు స్థాయిలను కోల్పోయింది. ఎందుకంటే రూ. 60,000 దిగువనే ట్రేడయ్యే పక్షంలో వెండిలో ఒత్తిడి కొనసాగనుంది.