For Money

Business News

దగ్గుమందు తాగి 66 మంది గాంబియా పిల్లల మృతి

గాంబియాలో గత జులైలో దగ్గు మంది తాగి 66 మంది పిల్లలు మరణించారు. పిల్లలందరూ అయిదేళ్ళలోపువారే. వీరి మరణానికి కారణంగా భారత్‌కు చెందిన మైడెన్‌ ఫార్మాస్యూటికల్స్‌ అనే కంపెనీ తయారు చేసిన దగ్గు మందేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూఓ) పేర్కొంది. ఈ కంపెనీ తయారు చేసిన నాలుగు దగ్గు మందులు పిల్లల మరణానికి కారణమని ట్వీట్‌ చేసింది. ఈ ఘటనకు సంబంధించి లోతుగా దర్యాప్తు చేస్తున్నామని పేర్కొంది. కంపెనీ అధికారులతో పాటు ప్రభుత్వం అధికారులతో ఈ విషయమై విచారణ జరుపుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. మైడెన్‌ ఫార్మాస్యూటికల్స్‌కు చెందిన ఈ నాలుగు దగ్గు మందుల గురించి ఇతరదేశాలను హెచ్చరించినట్లు పేర్కొంది. వెంటనే ఈ మందులను నిషేధించడంతో పాటు సరఫరాలో ఉన్న మందులను ఉపసంహరించాలని పేర్కొంది. కంపెనీ సరఫరా చేసిన నాలుగు దగ్గు మందులు కలుషితమని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. ఈ దగ్గు మందుల గురించి తాము దర్యాప్తు చేస్తున్నట్లు గాంబియా గత నెలలో వెల్లడించింది.