మూడు రోజుల్లోనే లిస్టింగ్!
పబ్లిక్ ఆఫర్ ద్వారా షేర్లను జారీ చేయడం మరింత సులువు, వేగవంతం కానుంది. పబ్లిక్ ఆఫర్ ముగిసిన తరవాత షేర్లు ఇపుడు ఆరు రోజుల్లో లిస్ట్ అవుతున్నాయి. ఈ వ్యవధిని మూడు రోజులకు తగ్గించాలని స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ప్రతిపాదించింది. ఈ మేరకు సంప్రదింపుల పత్రాన్ని జారీ చేసింది. సంబంధిత వర్గాల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోనుంది. ఈ గడువు జూన్ మూడుతో ముగియనుంది. తరవాత దీనిపై సెబీ తుది నిర్ణయం తీసుకోనుంది. పబ్లిక్ ఆఫర్లు త్వరగా పూర్తి చేసేందుకు సెబీ ఇటీవలి కాలంలో అనేక చర్యలు తీసుకుంది. దీనివల్ల పబ్లిక్ ఆఫర్ షేర్లను మరింత వేగవంతంగా పూర్తి చేసే వీలుందని సెబీ భావిస్తోంది. దీనివల్ల కంపెనీకి నిధులు త్వరగా అందడంతో పాటు ఇన్వెస్టర్లకు కూడా షేర్ల కేటాయింపు లేదా నిధులు వెనక్కి రావడం త్వరగా పూర్తి అవుతాయని సెబీ భావిస్తోంది.