For Money

Business News

దివిస్ ల్యాబ్స్ లాభాల్లో భారీ క్షీణత

మార్చితో ముగిసిన మూడు నెలలకు దివిస్ ల్యాబ్స్ (Divis Labs) పూర్తి నిరుత్సాహకర ఫలితాలను వెల్లడించింది. ఈ ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో కంపెనీ రూ. 320.97 కోట్ల లాభాలను ఆర్జించింది. గత ఏడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే కంపెనీ నికర లాభం 64.1% క్షీణించింది. గత ఏడాది ఇదే కాలంలో కంపెనీ రూ. 894.64 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. కంపెనీ ఆదాయం మాత్రం 22.5 శాతం క్షీణించి రూ. 2,518.4 కోట్ల నుంచి రూ. 1,950.8 కోట్లకు తగ్గింది. 2022-23 పూర్తి ఆర్థిక సంవత్సరంలో దివిస్ ల్యాబ్స్ రూ. 8112 కోట్ల ఆదాయం ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే టర్నోవర్‌ 14 శాతం తగ్గింది. అదే నికర లాభం 39 శాతం దాకా తగ్గి రూ. 1808 కోట్లకు చేరింది. ఒక్కో షేర్ పై రూ. 30ల ఫైనల్ డివిడెండ్‌ను దివిస్ ల్యాబ్స్ ప్రకటించింది. ఈ షేర్‌ గత శుక్రవారం 1.86 శాతం క్షీణించి రూ. 3097 వద్ద ముగిసింది.