For Money

Business News

స్థిరంగా సింగపూర్ నిఫ్టి

నిన్న అంతర్జాతీయ మార్కెట్లన్నీ నష్టాలతో ముగిశాయి.ముఖ్యంగా జపాన్‌ నిక్కీ నిన్న ఒక శాతం దాకా నష్టపోయింది. ఒక యూరో మార్కెట్లు కూడా ఒక శాతంపైగా నష్టంతో క్లోజ్‌ కాగా, వాల్‌స్ట్రీట్‌లోనూ ఇదే ట్రెండ్ కన్పించింది. అయితే డౌజోన్స్‌ కేవలం నామ మాత్రపు నష్టాలతో క్లోజైంది. టెక్‌ షేర్ల ఆర్థిక ఫలితాలు నిరాశాజనకంగా ఉండటంతగో నాస్‌డాక ఒకదశలో 1.5 శాతంపైగా నష్టపోయింది. అయితే క్లోజింగ్‌లో స్వల్పంగా కోలుకుని 1.13 శాతం నష్టంతో ముగిశాయి. ఒక ఎస్‌ అండ్‌ పీ 500 సూచీ నష్టాలు 0.42 శాతం. ఇక ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు నష్టాల్లో ఉన్నాయి. ఇవాళ కూడా నిక్కీ 0.8 శాతం నష్టంతో ఉంది. ఇక మిగిలిన మార్కెట్లలో హాంగ్‌సెంగ్‌ 1.4 శాతం నష్టంతో ఉంది. అమెరికాలో లిస్టయిన అనేక చైనా కంపెనీలు భారీ నష్టాలతో ట్రేడవుతున్నాయి. మిగిలిన మార్కెట్ల నష్టాలు అర శాతం దాకా ఉన్నాయి. నిన్న మరింత క్షీణించిన క్రూడ్‌ ఇవాళ స్థిరంగా ఉంది. ఇదొక్కటే మన మార్కెట్లకు పాజిటివ్‌ అంశం. సింగపూర్ నిఫ్టి కేవలం 30 పాయింట్ల నష్టంతో ఉంది. చూస్తుంటే నిఫ్టి గ్రీన్‌లో లేదా స్వల్ప నష్టాలతో ప్రారంభం కావొచ్చు.