For Money

Business News

నికర లాభం 450 శాతం జంప్‌

నాట్కో ఫార్మా జూన్ త్రైమాసికానికి అత్యంత ఆకర్షణీయ ఫలితాలు ప్రకటించింది. ఈ త్రైమాసికంలో కంపెనీ రూ .918.9 కోట్ల కన్సాలిడేటెడ్‌ ఆదాయం పై రూ.320.4 కోట్ల నికరలాభం ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదేకాలంలో రూ .427.3 కోట్ల ఆదాయం పై నికరలాభం రూ .75 కోట్లు మాత్రమే. ఏడాది క్రితంతో పోలిస్తే ఆదాయం 115 శాతం , నికరలాభం 450 శాతం పెరిగింది . అమెరికాలో గత మార్చిలో ప్రవేశపెట్టిన లెనలిడోమైడ్ ఔషధ విక్రయాల నుంచి అధిక ఆదాయాలు, లాభాలు కనిపిస్తున్నట్లు నాట్కో ఫార్మా ఎండీ వీసీ నన్నపనేని తెలిపారు. దేశీయ మార్కెట్లో ఫార్ములేషన్ ఔషధాల ఆదాయాలు స్థిరంగా ఉన్నట్లు వెల్లడించారు. సిబ్బందికి అమలు చేసిన వీఆర్‌ఎస్‌తో పాటు పరిశోధన- అభివృద్ధికి చేసిన అధిక వ్యయాల వల్ల ఖర్చుల భారం కాస్త పెరిగిందని ఆయన అన్నారు. కంపెనీ ఒక్కో షేరుపై రూ .3.50 మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. డివిడెండ్‌కు రికార్డు తేదీ ఈ నెల 22.