For Money

Business News

భారత్‌ స్వర్ణయుగంలో అడుగు పెడుతోంది

భారత ఆర్థిక వ్యవస్థ గోల్డన్‌ పీరియడ్‌లో అడుగు పెడుతోందని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ ఇన్వెస్టర్‌ రాకేష్‌ ఝున్‌ఝున్‌వాలా అన్నారు. సీఎన్‌బీసీ టీవీ18కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు అంశాలపై మాట్లాడారు. భారత ఆర్థిక వ్యవస్థ మున్ముందు పది శాతం వృద్ధి రేటుతో ముందుకు సాగుతుందని అన్నారు. రుణాలకు డిమాండ్‌ పెరుగుతుందని.. అందుకే తాను ప్రభుత్వ రంగ బ్యాంక్‌ షేర్లను రెకమెండ్‌ చేస్తున్నానని ఆయన అన్నారు. హాస్పిటల్‌ రంగంలో కూడా పెట్టుబడికి మంచి అవకాశాలు ఉన్నాయని అన్నారు. 1947లో భారత జీడీపీ విలువు రూ. 2.7 లక్షలు కాగా, ఇపుడ రూ. 197.5 లక్షల కోట్లకు చేరిందని ఆయన అన్నారు. అలాగే మన విదేశీ మారక ద్రవ్య నిల్వలు 300 కోట్ల డాలర్ల నుంచి 57400 కోట్ల డాలర్లకు చేరినట్లు ఆయన గుర్తు చేశారు. అలాగే భారత కంపెనీల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ 1988లో కేవలం 2360 కోట్ల డాలర్లు కాగా ఇపుడ 3,43,700 కోట్ల డాలర్లని ఆయన అన్నారు. అంతర్జాతీయ మార్కెట్లు ఎలా ఉన్నా…మన మార్కెట్లు మాత్రం ముందుకు సాగుతాయని అన్నారు. స్పీడు తగ్గినా మన మార్కెట్ల పయనం ముందుకేనని అన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల పట్ల తాను చాలా బుల్లిష్‌గా ఉన్నానని.. ఎందుకంటే రుణాలకు మున్ముందు డిమాండ్‌ పెరుగుతుందని అన్నారు. అలాగే హాస్పిటల్‌ రంగంలో కూడా మంచి అవకాశాలు ఉన్నాయని ఆయన అన్నారు. ఆయన పూర్తి ఇంటర్వ్యూ దిగువ వీడియోలో చూడండి..