For Money

Business News

స్థిరంగా సింగపూర్ నిఫ్టి

అంతర్జాతీయ మార్కెట్లలో స్తబ్దత నెలకొంది. కొవిడ్‌తో పాటు మాంద్యం భయాలతో వెల్లువెత్తిన అమ్మకాలు తగ్గినట్లు కన్పిస్తోంది. శుక్రవారం అమెరికా మార్కెట్లన్నీ గ్రీన్‌లో ముగిశాయి. డౌ జౌన్స్‌, ఎస్‌ అండ్ పీ 500 సూచీలు అర శాతంపైగా లాభపడగా, నాస్‌డాక్‌ మాత్రం 0.25 శాతం లాభంతో ముగిశాయి. ఇక ఉదయం నుంచి అదే స్థాయి లాభాలతో ఫ్యూచర్స్‌ కొనసాగుతున్నాయి. అయితే ఆసియా మార్కెట్లలో పెద్ద ఉత్సాహం లేదు. అయితే చైనా మార్కెట్లు గ్రీన్‌లో ఉండటం ఒక శుభ పరిమాణం. జపాన్‌ నిక్కీ స్థితి స్థిరంగా ఉంది. హాంగ్‌కాంగ్‌ మార్కెట్లకు ఇవాళ సెలవు. ఇతర మార్కెట్లలో పెద్దగా మార్పు లేదు. ఈ నేపథ్యంలో సింగపూర్ నిఫ్టి కేవలం 25 పాయింట్ల లాభంతో ఉంది. అంటే ఇవాళ మార్కెట్లు స్థిరంగా ప్రారంభం కానున్నాయి.