For Money

Business News

స్థిరంగా సింగపూర్ నిఫ్టి

అంతర్జాతీయ మార్కెట్లలో పతనం కొనసాగుతోంది. కరెన్సీ మార్కెట్‌లో డాలర్‌ పెరగడంతో పాటు బాండ్‌ ఈల్డ్స్‌ పెరుగుతున్నాయి. రాత్రి బులియన్‌ ధరలు పెరిగినట్లే పెరిగి.. తగ్గాయి. బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ క్షీణించినా.. 94 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. రాత్రి అమెరికా మార్కెట్ల ట్రెండ్‌ రివర్సయింది. రాత్రి ఆరంభంలో డౌజోన్స్‌ ఒక శాతం వరకు నష్టంలో ఉండగా… క్లోజింగ్‌లో 0.12 శాతం లాభంతో ముగిసింది. అదే నాస్‌డాక్‌ ఆరంభంలో స్వల్ప నష్టాల్లో ఉండగా.. చివరల్లో ఒక శాతంపైగా క్షీణించింది. ఎస్‌ అండ్‌ పీ 500 సూచీ 0.65 శాతం నష్టంతో ముగిసింది. ఇక ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు నష్టాల్లో ఉన్నాయి. హాంగ్‌సెంగ్‌ 1.76 శాతం, తైవాన్‌ 0.8 శాతం నష్టపోగా షాంఘై కూడా ఇదే స్థాయి నష్టంతో ట్రేడవుతోంది. జపాన్‌ నిక్కీ మాత్రం దాదాపు క్రితం స్థాయి వద్దే ఉంది. ఈ నేపథ్యంలో సింగపూర్ నిఫ్టి 35 పాయింట్ల లాభంతో ఉంది. ఇదేం పెద్ద లాభం కాదు. నిఫ్టి కూడా స్థిరంగా ప్రారంభమయ్యే అవకాశముంది.