For Money

Business News

భారతవృద్ధి రేటులో ఐఎంఎఫ్‌ కోత

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారతదేవ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటును అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ తగ్గించింది. గతంలో భారత జీడీపీ వృద్ధి రేటు 8.2 శాతం ఉంటుందని అంచనా వేసిన ఐఎంఎఫ్‌ తరవాత 7.4 శాతానికి తగ్గింది. ఇపుడు ఆ వృద్ధి రేటును మరొంతగా 6.8 శాతానికి తగ్గించింది. గత ఆర్థిక సంవత్సరం (2021-22)లో భారత వృద్ధి రేటు 8.7 శాతంగా నమోదైంది. రెండో త్రైమాసికంలో అంచనా స్థాయిలో పారిశ్రామిక ఉత్పత్తి లేకపోవడంతో పాటు డిమాండ్‌ అంతంత మాత్రంగానే వృద్ధి రేటు తగ్గించడానికి కారణాలు ఐఎంఎఫ్‌ పేర్కొంది.