For Money

Business News

లాభాల్లో SGX NIFTY

భారీఅమ్మకాల తరవాత ఈక్విటీ మార్కెట్ల కాస్త ఊరట కన్పిస్తోంది. రాత్రి అమెరికా మార్కెట్లు తీవ్ర ఒడుదుడుకులకు లోనయ్యాయి. ఉదయం నష్టాల నుంచి లాభాల్లోకి వచ్చిన వాల్‌స్ట్రీట్‌… మిడ్‌ సెషన్‌ కల్లా మళ్ళీ భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. నాస్‌డాక్‌ మాత్రం చాలా వరకు నష్టాలను తగ్గించుకుని 0.6 శాతం నష్టంతో ముగిసింది.ఎస్‌ అండ్‌ పీ 500 సూచీ రాత్రి ఒక శాతం నష్టపోయింది. ఈ రెండు సూచీలు ఇప్పటికీ బేర్‌ మార్కెట్‌లోకి ప్రవేశించాయి. రాత్రి డౌజోన్స్‌ కూడా బేర్‌ మార్కెట్‌లోకి ప్రవేశించింది. రాత్రిఈ సూచీ 1.11 శాతం నష్టంతో ముగిసింది. గరిష్ఠ స్థాయి నుంచి 20 శాతంపైగా పడితే సూచీ బేర్‌ ఫేజ్‌లోకి వెళ్ళినట్లు పరిగణిస్తారు. నాస్‌డాక్‌ 30 శాతం పైగా, ఎస్‌ అండ్‌ పీ 500 సూచీ 22 శాతంపైగా నష్టపోయాయి. ఇక ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ఉన్నాయి. జపాన్‌, ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్‌ మార్కెట్లు గ్రీన్‌లో ఉండగా.. చైనా, హాంగ్‌ సెంగ్‌ మార్కెట్లు నష్టాల్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో సింగపూర్‌ నిఫ్టి 65 పాయింట్ల లాభంతో ఉంది. సో..నిఫ్టి స్థిరంగా లేదా స్వల్ప లాభంతో ప్రారంభం కావొచ్చు.