For Money

Business News

కొత్త లుక్‌లో గ్రాండ్‌ విటారా

కొత్తగా డిజైన్ చేసిన ఎస్‌యూవీ కారు ‘గ్రాండ్ విటారా’ను మారుతీ సుజుకీ మార్కెట్‌లోకి విడుద‌ల చేసింది. దీని ప్రారంభ ధ‌ర రూ.10.45 ల‌క్షలు. స్మార్ట్ హైబ్రీడ్ ఎస్‌యూవీ కారు ఇంజిన్ క్విక్‌గా ఇంజిన్ నుంచి ఎల‌క్ట్రిక్ డ్రైవ్ మోడ్‌లోకి షిఫ్ట్ అవుతుందని కంపెనీ పేర్కొంది. మారుతి గ్రాండ్ విటారా కారు ప‌ది వేరియంట్ల‌లో, మూడు డ్యుయ‌ల్‌, 6 సింగిల్ క‌ల‌ర్ ఆప్షన్లలో ల‌భిస్తుంది. గ్రాండ్ విటారా లీట‌ర్ పెట్రోల్‌పై 27.97 కిలోమీట‌ర్ల మైలేజీ ఇస్తుందని కంపెనీ పేర్కొంది. లిథియం అయాన్ బ్యాట‌రీతోపాటు మారుతి సుజుకి గ్రాండ్ విటారా-2022 కారులో సెల్ఫ్ చార్జి బ్యాట‌రీ, స‌న్‌రూఫ్ ఉంటాయి. ఈ కారు బుకింగ్‌ కంపెనీ జూలైలో ప్రారంభించింది. వాటి డెలివరీ ఇపుడు పండుగ సీజన్‌లో చేస్తోంది.