For Money

Business News

ధరతో పాటు డిమాండ్‌ పెరుగుతోంది

పెరుగుతున్న ఉత్పాదక వ్యయం, వడ్డీరేట్లు, డిమాండ్‌ వల్ల ఇళ్ళ ధరలు పెరుగుతున్నాయి. అయినా డిమాండ్‌ తగ్గడం లేదని ఓ సర్వే వెల్లడించింది. రాబోయే నెలల్లో ఇళ్ళ ధరలు పెరుగుతాయని దాదాపు 50 శాతం కొనుగోలుదారులు నమ్ముతున్నారని హౌజింగ్‌ డాట్‌ కామ్‌ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. పరిశ్రమ సంఘం నరెడ్కో సంయుక్తంగా హౌజింగ్‌ డాట్‌ కామ్‌ ఈ సర్వే నిర్వహించింది. గత జూన్‌తో ముగిసిన మూడు నెలల్లో పరిశ్రమం ట్రెండ్‌తో ‘రెసిడెన్షియల్‌ రియల్టీ కన్జ్యూమర్‌ సెంటిమెంట్‌ సర్వే’ వివరాలను విడుదల చేశాయి. సర్వేలో వెయ్యి మందికిపైగా కొనుగోలు పాల్గొన్నారు. తాజా సర్వేలో పాల్గొన్నవారిలో 47 శాతం మంది రియల్‌ ఎస్టేట్‌లో పెట్టుబడులకే ఆసక్తిని ప్రదర్శించారు. అలాగే 21 శాతం మంది స్టాక్‌ మార్కెట్లలో మదుపు చేసేందుకు మొగ్గు చూపారు. ఇక 16 శాతం మంది ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల (ఎఫ్‌డీ)లో, 15 శాతం మంది బంగారంపై ఇన్వెస్ట్‌ చేసేందుకు మక్కువ కనబర్చారని హౌజింగ్‌.కామ్‌, నరెడ్కో తెలిపాయి.