For Money

Business News

SGX NIFTY 84 పాయింట్లు డౌన్‌

ఇవాళ రాత్రికి అమెరికా సెంట్రల్‌ బ్యాంక్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లను పెంచనుంది. నిన్న రాత్రి ప్రారంభమైన ఫెడ్‌ సమావేశం ఇవాళ రాత్రి ముగుస్తుంది. వడ్డీ రేట్లు పెంచినా అమెరికాలో ద్రవ్యోల్బణం తగ్గడం లేదు. ఆర్థిక గణాంకాలు చాలా పాజిటివ్‌గా ఉన్నాయి. ఎక్కడా ఆర్థిక వ్యవస్థ చల్లబడుతున్న దాఖలాలు లేవు. దీంతో ఇవాళ ఫెడ్‌ కనీసం 0.75 శాతం మేర వడ్డీ రేట్లను పెంచుతుందని భావిస్తున్నారు. ఈ మేరకు పెంపును మార్కెట్‌ డిస్కౌంట్‌ చేసింది. అయితే మున్ముందు ఫెడ్‌ తీసుకునే నిర్ణయాలకు సంబంధించి సంస్థ ఛైర్మన్‌ పావెల్‌ ప్రసంగం కోసం మార్కెట్‌ ఎదురు చూస్తోంది. రాత్రి అమెరికా మార్కెట్లు ఒక శాతంపైగా నష్టపోయాయి. అంతకుముందు యూరో మార్కెట్లు కూడా ఇదే స్థాయి నష్టాలతో క్లోజయ్యాయి. డాలర్‌ ఇండెక్స్‌ 110 ప్రాంతంలో ఉంది. ఇక ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు కూడా భారీ నష్టాల్లో ఉన్నాయి. జపాన్‌, హాంగ్‌కాంగ్, ఆస్ట్రేలియా మార్కెట్లు ఒకటిన్నర శాతం నష్టంతో ఉన్నాయి. చైనా మార్కెట్ల నష్టాలు అర శాతం లోపే ఉన్నాయి. ఈ నేపథ్యంలో సింగపూర్ నిఫ్టి 84 పాయింట్ల నష్టంతో ఉంది. సో నిఫ్టి ఇవాళ స్వల్ప నష్టాలతో ప్రారంభం కావొచ్చు.