For Money

Business News

నిఫ్టి: ఓపెనింగ్‌లోనే భారీ పతనం

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ నిఫ్టిని దెబ్బ తీసింది. భారతీ ఎయిర్‌టెల్‌ కాపాడే ప్రయత్నం చేస్తోంది. నిఫ్టి ఓపెనింగ్‌లోనే 17,805ని తాకిన నిఫ్టి కేవలం 10 నిమిషాల్లోనే 17,611ని తాకింది. దాదాపు 200 పాయింట్లు క్షీణించింది. రిలయన్స్‌, సౌదీకి చెందిన ఆరామ్‌ కో మధ్య జరిగిన ఒప్పందాన్ని పునః పరిశీలించాలని రెండు కంపెనీలు నిర్ణయించాయి. ఈ నేపథ్యంలో నిఫ్టి 4 శాతం క్షీణించింది. ఏకంగా 20 శాతం నుంచి 25 శాతం వరకు చార్జీలను పెంచడంతో భారతీ ఎయిర్‌టెల్‌ షేర్‌ 5 శాతం లాభంతో ట్రేడవుతోంది. అన్ని సూచీలు ఇవాళ రెడ్‌లో ఉన్నాయి. నిఫ్టి ప్రస్తుతం 138 పాయింట్ల నష్టంతో 17626 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. మిడ్‌క్యాప్‌ సూచీ 1.42 శాతం నష్టంతో ఉంది.నిఫ్టిలో 32 షేర్లు నష్టాల్లో ఉన్నాయి.