For Money

Business News

పేటీఎం ఇన్వెస్టర్లు లబోదిబో

పేటీఎం పబ్లిక్‌ ఇష్యూకు దరఖాస్తు చేసిన సాధారణ ఇన్వెస్టర్లు దారుణంగా బుక్‌ అయిపోయారు. ఓపెనింగ్‌ రోజే 27 శాతంపైగా క్షీణించడంతో ఎవరూ అమ్మడానికి సాహసించ లేదు. మున్ముందు పెరుగుతుందని ఆశతో ఉంచుకున్నారు. ఇవాళ మరో 9 శాతం క్షీణించి వారి ఆశలను వమ్ము చేసింది పేటీఎం. ఇవాళ ఎన్‌ఎస్‌ఈలో పేటీఎం షేర్‌ రూ.1,417కు పడిపోయింది. కేవలం రెండు ట్రేడింగ్‌ సెషన్స్‌లో రూ. 2,130 నుంచి రూ. 1,417కు పడింది. స్టాక్‌ మార్కెట్‌లో పలు రీసెర్చి సంస్థలు పేటీఎం షేర్‌ను రూ. 1,200 వద్ద కొనుగోలు చేయొచ్చని సలహా ఇస్తున్నాయి. మరి ఆ స్థాయికి ఈ షేర్‌ చేరుతుందా అనేది చూడాలి. ఎందుకంటే పబ్లిక్ ఆఫర్‌లో 87 శాతం వాటాను సంస్థాగత ఇన్వెస్టర్లు కొనుగోలు చేశారు. మరి వారు ఈ షేర్‌కు అండగా ఉంటారనే వాదన కూడా ఉంది. ప్రస్తుత స్థాయిలో వారు కొనుగోళ్ళు చేసి ఆదుకుంటారా? లేదా మరింత పడిన తరవాత కొంటారా? అన్నది చూడాలి.