For Money

Business News

విజయా డయాగ్నోస్టిక్‌ ఐపీఓకు ఓకే

హైదరాబాద్‌కు చెందిన విజయా డయాగ్నోస్టిక్‌ సెంటర్‌ పబ్లిక్‌ ఆఫర్‌కు క్యాపిటల్‌ మార్కెట్‌ నియంత్రణ మండలి సెబీ ఆమోదం తెలిపింది. ఐపీఓలో భాగంగా విజయా డయాగ్నోస్టిక్‌ ప్రమోటర్లు ఎస్‌ సురేంద్రనాథ్‌ రెడ్డి, ఇన్వెస్టర్లు కారకోరమ్‌, కేదారా క్యాపిటల్‌కు చెందిన 3.57 కోట్ల షేర్లను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎ్‌ఫఎస్‌) పద్ధతిన అమ్మనున్నారు. ఈ షేర్లు కంపెనీలో 35 శాతం వాటాకు సమానం. అందులో 30 శాతం వాటాను కేదారా క్యాపిటల్‌ ఉపసంహరించుకోనుంది. కేదారా క్యాపిటల్‌ ఈ డయాగ్నోస్టిక్‌ సెంటర్‌లో 40 శాతం వాటాను రూ.400 కోట్లకు 2016లో కొనుగోలు చేసింది. 1981లో ప్రారంభమైన విజయా డయాగ్నోస్టిక్‌కు దేశంలోని 13 నగరాల్లో 80 అధునాతన పరీక్షా కేంద్రాలున్నాయి.