For Money

Business News

నిఫ్టికి మెటల్స్‌ అండ

నిఫ్టి తన తొలి ప్రధాన నిరోధ స్థాయి వద్ద ప్రారంభమైంది. ఓపెనింగ్‌లోనే 15,860 నుంచి కొన్ని సెకన్లలోనే 15,880ని తాకింది. ప్రస్తుతం 36 పాయింట్ల లాభంతో 15860 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. నిఫ్టికి మెటల్స్‌ నుంచి గట్టి మద్దతు లభించింది. అలాగే బ్యాంక్‌ నిఫ్టి కూడా అరశాతం లాభంతో నిఫ్టికి తోడుగా ఉంది. నిఫ్టికన్నా మిడ్‌ క్యాప్‌ షేర్లలో మద్దతు అధికంగా కన్పిస్తోంది. ఫలితాలకు ఆయా కంపెనీల షేర్లు రియాక్ట్‌ అవుతున్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్‌ లాభాల్లో ఉండగా, యాక్సిస్‌ బ్యాంక్‌, ఎల్‌ అండ్‌ టీ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. ఇవాళ్టికి నిఫ్టి రేంజ్‌ 15,780-15,880 మధ్య ఉండొచ్చు. నిఫ్టిలో 42 షేర్లు గ్రీన్‌లో ఉన్నాయి. 15,840పైన ఉన్నంత వరకు నిఫ్టికి ఢోకా లేదు. లేదంటే 15,780ని తాకే అవకాశముంది.

నిఫ్టి టాప్‌ గెయినర్స్‌
హిందాల్కో 410.35 2.57
ఎస్‌బీఐ లైఫ్‌ 1,091.90 1.42
టాటా స్టీల్‌ 1,315.60 1.36
ఐసీఐసీఐ బ్యాంక్‌ 683.00 0.92
శ్రీ సిమెంట్‌ 28,210.00 0.86

నిఫ్టి టాప్‌ లూజర్స్‌
నెస్లే ఇండియా 18,020.00 -0.45
హెచ్‌డీఎఫ్‌సీ 2,454.05 -0.42
యాక్సిస్‌ బ్యాంక్‌ 753.50 -0.37
ఎల్‌ అండ్‌ టీ 1,592.15 -0.34
విప్రో 589.55 -0.15