For Money

Business News

నిఫ్టికి ఫార్మా షాక్‌…

ఉదయం మెటల్స్‌ అండగా పటిష్ఠంగా ఉన్న నిఫ్టికి మిడ్‌ సెషన్‌ తరవాత గట్టి షాక్‌ తగిలింది. యూరో మార్కెట్లు నష్టాల్లో ప్రారంభం కావడంతో… గట్టి సాకు కోసం ఎదురు చూస్తున్న మార్కెట్‌కు డాక్టర్‌ రెడ్డీస్‌ ఫలితాలు కలిసి వచ్చాయి. కంపెనీ పనితీరు మార్కెట్‌ అంచనాలకు అనుగుణంగా లేకపోవడంతో భారీ అమ్మకాల ఒత్తిడి వచ్చింది. ఒకదశలో రూ. 4,780కి క్షీణించిన డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌ షేర్‌ చివర్లో కాస్త కోలుకుని పది శాతంపైగా నష్టంతో రూ. 4,853 వద్ద ముగిసింది. ఈ దెబ్బతో ఉదయం లాభాల్లో ఉన్న దివీస్‌ ల్యాబ్‌ షేర్‌ కూడా రెండున్నర శాతం నష్టంతో ముగిసింది. వెరశి నిఫ్టి ఇవాళ గరిష్ఠ స్థాయి నుంచి 180 పాయింట్లు పడింది. ఒకదశలో 15701 పాయింట్లకు పడిన నిఫ్టి క్లోజింగ్‌లో కాస్త కోలుకుని 15,746 పాయింట్ల వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 78 పాయింట్లు క్షీణించింది. బ్యాంక్‌ నిఫ్టి అర శాతం నష్టపోగా, మిడ్‌ క్యాప్‌ సూచీ 0.7 శాతం నష్టపోయింది.

నిఫ్టి టాప్‌ గెయినర్స్‌
హిందాల్కో 417.35 4.32
ఎస్‌బీఐ లైఫ్‌ 1,111.00 3.19
టాటా స్టీల్‌ 1,333.50 2.74
బజాజ్‌ ఫిన్‌ సర్వ్‌ 13,795.60 2.00
ఎస్‌బీఐ 429.20 1.39

నిఫ్టి టాప్‌ లూజర్స్‌
డాక్టర్‌ రెడ్డీస్‌ 4,853.20 -10.31
సిప్లా 917.15 -3.51
యాక్సిస్‌ బ్యాంక్‌ 731.65 -3.26
అదానీ పోర్ట్స్‌ 662.35 -3.00
దివీస్‌ ల్యాబ్‌ 4,800.00 -2.46