For Money

Business News

డిపాజిట్లపై వడ్డీ రేటు పెంపు

మార్కెట్‌లో రుణాలపై వడ్డీ రేట్లను ఎడాపెడా పెంచుతున్న బ్యాంకులు .. ఆ మేరకు డిపాజిట్లపై కూడా కాస్త పెంచుతున్నాయి. తాజాగా ఎస్‌బీఐ తన ఖాతాదారుల నుంచి స్వీకరించే డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది. ఈ రేట్లు రూ.2 కోట్లు.. అంతకన్నా తక్కువ మొత్తం డిపాజిట్లకే వర్తిస్తాయి. 7 నుంచి 45 రోజుల్లోపు ఉండే డిపాజిట్ల వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు లేదు. అదే 46 – 179 రోజుల డిపాజిట్లపై వడ్డీని 4 నుంచి 4.5 శాతానికి పెంచింది. సీనియర్‌ సిటిజన్లకయితే 5 శాతం ఇస్తారు. అలాగే 180 -210 రోజుల డిపాజిట్లపై వడ్డీ రేట్లను 4.65 శాతం నుంచి 5.28 శాతానికి పెంచింది. సీనియర్‌ సిటిజన్లకు మరో 0.6 శాతం అధిక వడ్డీని చెల్లిస్తారు. వీరికి 5.75 శాతం వడ్డీ లభిస్తుంది. ఇక 211 నుంచి ఒక ఏడాది డిపాజిట్లపై వడ్డీని 4.70 శాతం నుంచి 5.50 శాతానికి, ఏడాది నుంచి రెండేళ్ళ లోపు డిపాజిట్లపై 5.6 శాతం నుంచి 6.1 శాతానికి పెంచింది. ఇక 2 నుంచి మూడేళ్ళలోపు డిపాజిట్లపై వడ్దీ రేట్లు 5.65 శాతం నుంచి 6.25 శాతానికి పెంచింది. 3 ఏళ్ళ నుంచి 5 ఏళ్ళ లోపు డిపాజిట్లపై ఇచ్చే వడ్డీ మాత్రం 5.8 శాతం నుంచి 6.10 శాతానికి మాత్రమే పెంచింది. అలాగే 5 ఏళ్ళ నుంచి 10 ఏళ్ళలోపు డిపాజిట్లపై ఇచ్చే వడ్డీని 5.85 శాతం నుంచి 6.10 శాతానికి పెంచింది. ఈ రెండు స్లాబుల్లో సీనియర్‌ సిటిజన్లకు చాలా తక్కువగా పెంచింది. ఈలెక్కన 46 రోజుల నుంచి 179 రోజుల వరకు డిపాజిట్‌ చేసేవారికి అత్యధిక వడ్డీ అంటే 0.8 శాతం మేర వడ్డీ పెంచినట్లయింది. కొత్త రేట్లు రేపటి నుంచి అమల్లోకి వస్తాయి.