For Money

Business News

రూపాయి @ 80

విదేశీ మారక ద్రవ్య మార్కెట్‌ (ఫారెక్స్‌)లో డాలర్‌తో రూపాయి 80ని దాటింది. దేశ చరిత్రలో డాలర్‌తో రూపాయితో ఈ స్థాయికి చేరడం ఇదే మొదటిసారి. నిన్న రూపాయి 79.90 వద్ద ముగిసింది. ఇవాళ ఉదయం ఓపెనింగ్‌లోనే 80ని క్రాస్‌ చేసింది. ఈ నెలలోనే రూపాయి 2 శాతం క్షీణించగా, 2022లో అంటే 8 శాతం క్షీణించింది. రాత్రి అమెరికా మార్కెట్‌లో డాలర్‌ విలువ క్షీణించినా.. ఇవాళ ఉదయం డాలర్‌ ఇండెక్స్‌ 107 వద్ద ట్రేడవుతోంది. అయితే రూపాయి ఇవాళ భారీగా పతనం కావడానికి కారణం… రాత్రి క్రూడ్‌ ధరలు 5 శాతంపైగా పెరగడం. ఇపుడున్న పరిస్థితుల్లో క్రూడ్‌ ఆయిల్ ఉత్పత్తి పెంచేందుకు సౌదీ అరేబియా ససేమిరా అనడంతో క్రూడ్‌ ధరలు రాత్రి భారీగా పెరిగాయి.