For Money

Business News

16200పైనే నిఫ్టి

సింగపూర్‌ నిఫ్టితో పోలిస్తే నిఫ్టి చాలా పటిష్ఠంగా ప్రారంభమైంది. ఓపెనింగ్‌లో 16187కి పడినా.. అదే స్థాయిలో మద్దతు లభించింది. ప్రస్తుతం 10237 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి కేవలం 40 పాయింట్ల నష్టంతో ఉంది. సెన్సెక్స్‌ 157 పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది. నిఫ్టితో పాటు ఇతర సూచీలు కూడా నష్టాల్లో ఉన్నాయి. అయితే నష్టాలన్నీ నామ మాత్రంగా ఉన్నాయి. టాటా స్టీల్‌ నిఫ్టి టాప్‌ గెయినర్‌ కాగా, క్రూడ్‌ ధరలు పెరిగినందున ఏషియన్‌ పెయింట్స్‌ టాప్‌ లూజర్‌గా నిలిచింది. నిఫ్టి నెక్స్ట్‌లో టాప్‌ గెయినర్స్‌ అన్నీ ఫార్మా షేర్లు కావడం విశేషం. టోరెంట్‌ ఫార్మా, గ్లాండ్‌ ఫార్మా, బయోకాన్‌, జైడస్‌ లైఫ్‌ షేర్లు ఒక శాతంపైగా లాభంతో ఉన్నాయి. మిడ్‌ క్యాప్స్‌లో లారస్‌ ల్యాబ్‌ టాప్‌ గెయినర్స్‌లో ఉంది. ఆరంభంలో నిఫ్టి దిగువ స్థాయి నుంచి కోలుకుంది. మరి మార్కెట్‌లో మరోసారి ఒత్తిడి వస్తుందేమో చూడండి. వస్తే స్టాప్‌లాస్‌తో స్ట్రిక్ట్ స్టాప్‌లాస్‌తో కొనుగోలు చేయవచ్చని మార్కెట్ విశ్లేషకులు అంటున్నారు.