For Money

Business News

ఆల్‌టైమ్‌ కనిష్ఠ స్థాయికి రూపాయి

ఇంటర్‌ బ్యాంక్‌ ఫారిన్‌ ఎక్స్ఛేంజీలో డాలర్‌తో రూపాయి ఆల్‌ టైమ్‌ కనిష్ఠ స్థాయికి పడింది. అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్‌ ఇండెక్స్‌ 109కి చేరడంతో పాటు బ్రెంట్‌ క్రూడ్‌ ధరలు పెరగడంతో డాలర్‌కు డిమాండ్‌ పెరిగింది. ఉదయం 9 గంటలకు ట్రేడింగ్‌ ప్రారంభమైన కొన్ని నిమిషాలకే డాలర్‌తో రూపాయి విలువ 80.12కు పడిపోయింది. ఇది ఆల్‌టైమ్‌ కనిష్ఠస్థాయి. డాలర్‌తో రూపాయిని విలువను కాపాడేందుకు ఆర్బీఐ రంగంలోకి దిగింది. రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు ఒక ప్రైవేట్‌ బ్యాంకు ద్వారా ఆర్బీఐ డాలర్‌ను అమ్ముతోంది. మార్కెట్‌లోకి డాలర్‌ సరఫరా పెరగడంతో రూపాయి పతనం ఆగింది. దేశీయ స్టాక్‌ మార్కెట్‌లో ఇవాళ విదేశీ ఇన్వెస్టర్ల పాత్ర కీలకంగా మారింది. ఇవాళ విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాలకు పాల్పడే పక్షంలో రూపాయి బలహీనంగా ముగిసే అవకాశముంది.