For Money

Business News

కోలుకున్నా… భారీ నష్టాల్లో

స్టాక్‌ మార్కెట్‌లో అమ్మకాల ఒత్తిడి నుంచి కాస్త ఉపశమనం కలిగినా.. నిఫ్టి ఇంకా భారీ నష్టాల్లోనే ఉంది. ఉదయం 17166 పాయింట్ల కనిష్ఠ స్థాయికి పడిపోయిన నిఫ్టి కోలుకుని ప్రస్తుతం 17338 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. అంటే 170 పాయింట్లు కోలుకుందన్నమాట. అయినా 220 పాయింట్ల నష్టంతో ఉంది. కాస్సేపటి క్రితం ప్రారంభమైన యూరో మార్కెట్లు ఒకటిన్నర శాతం నష్టంతో ఉన్నాయి.ఆ మేరకు మన మార్కెట్లు కూడా ఒకటిన్నర శాతం వరకు నష్టంతో ఉన్నాయి. ముఖ్యంగా నిఫ్టి బ్యాంక్‌ 1.77 శాతం క్షీణించడంతో మున్ముందు రికవరీ ఈ షేర్లు కోలుకోవడంపైనే ఉంది. అమెరికా ఫ్యూచర్స్‌ ఇంకా అరశాతం నష్టంతో ఉన్నాయి. ఇక్కడి నుంచి యూరో మార్కెట్లు కోలుకుంటే మన మార్కెట్లు కూడా కోలుకుంటాయి. లేకుంటే మరింతగా నష్టపోతాయి. దీంతో చిన్న ఇన్వెస్టర్లు ప్రస్తుతానికి మార్కెట్‌ దూరంగా ఉండమని అనలిస్టులు సలహా ఇస్తున్నారు. మార్కెట్‌ నిలదొక్కుకునేంత వరకు ఆగమంటున్నారు. నిఫ్టిలో ఎఫ్‌ఎంసీజీ షేర్లు వెలుగులో ఉన్నాయి. కాల్గేట్‌ పామోలివ్‌, ఐటీసీ, బ్రిటానియా, నెస్లే షేర్లు పాజిటివ్‌గా ఉన్నాయి. నిఫ్టి నష్టపోయిన టాప్‌ షేర్లనీ ఐటీ కౌంటర్లే కావడం విశేషం. ఉదయం భారీగా నష్టపోయిన ఫార్మా షేర్లు వెంటనే కోలుకున్నాయి.