For Money

Business News

79ని బ్రేక్‌ చేసిన రూపాయి

విదేశీ మారక ద్రవ్య మార్కెట్‌లో డాలర్‌తో రూపాయి కొత్త ఆల్‌టైమ్‌ కనిష్ఠ స్థాయికి పడింది. ఇవాళ తొలిసారి డాలర్‌తో రూపాయి 79.09ని తాకింది. మోడీ అధికారంలో వచ్చినపుడు 59 రూపాయిలకు ఒక డాలర్ వస్తుండగా, ఇపుడు 79 రూపాయిలు ఇవ్వాల్సి వస్తోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్‌ పెరగడంతో పాటు మన స్టాక్‌ మార్కెట్‌లో విదేశీ ఇన్వెస్టర్ల భారీ అమ్మకాల కారణంగా డాలర్‌కు డిమాండ్‌ పెరుగుతోంది. డాలర్‌తో రూపాయి భారీగా క్షీణంచడంతో దిగుమతులు భారం బాగా పెరుగుతోంది. అయితే ఐటీ, ఫార్మా వంటి కంపెనీలకు బాగా లబ్ది పొందనున్నాయి. అందుకే అమెరికా మార్కెట్‌లలో నాస్‌డాక్‌ భారీగా క్షీణించినా.. మన ఐటీ కంపెనీలు నిలకడగా ఉండటానికి కారణం… రూపాయి పతనమే.