For Money

Business News

లోన్‌ యాప్‌ కంపెనీ: రూ. 370 కోట్లు జప్తు

బెంగళూరుకు చెందిన లోన్‌ యాప్‌ కంపెనీ ఎల్లో ట్యూన్‌ టెక్నాలజీస్‌ కంపెనీకి చెందిన రూ. 370 కోట్ల నిధులను జప్తు చేసినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) వెల్లడించింది. ఈ లోన్‌ యాప్‌తో దక్షిణాది రాష్ట్రాల్లో అనేక మంది వేధిస్తున్నట్లు అనేక పలు కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఈ కంపెనీకి చెందిన పలు స్థావరాలపై
ఈ నెల 8 నుంచి పదో తేదీ వరకు ఈడీ దాడులు నిర్వహించింది. మనదేశానికి చెందిన ఇద్దరు వ్యక్తులు బినామీలుగా ఉంచి ఈ కంపెనీని ఇద్దరు చైనీయులు నిర్వహించినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. వీరి పేర్లు అలెక్స్‌, కైదీగా తమ విచారణలో తేలిందని, అయితే ఇవి కూడా బోగస్‌ పేర్లను తెలుస్తోందని ఈడీ పేర్కొంది. లోన్‌ యాప్‌ ద్వారా జనం నుంచి వసూలు చేసిన సొమ్మును వాల్డ్‌ అనే క్రిప్టో ఎక్స్ఛేంజీలో దాచినట్లు గుర్తించింది. ఈ ఎక్స్ఛేంజీని ఫ్లిప్‌ఓల్ట్‌ టెక్నాలజీస్‌ అనే కంపెనీ నిర్వహిస్తోంది. ఎల్లో ట్యూన్‌ దాచిన మొత్తం క్రిప్టో ఆస్తుల గురించి ఈడీ అధికారులు ఆరా తీశారు. కనీస వివరాలు కూడా ఇవ్వడంలో క్రిప్టో ఎక్స్ఛేంజీ విఫలం కావడంతో … ఆ మొత్తాన్ని ఈడీ జప్తు చేసింది. ఎల్లో ట్యూన్‌ టెక్నాలజీస్‌ పేరుతో ఉన్న రూ. 164.4 కోట్ల బ్యాంక్‌, పేమెంట్‌ గేట్‌వే మొత్తంతో పాటు క్రిప్టో ఎక్స్ఛేంజీలో దాచిన రూ. 203.26 కోట్లను జప్తు చేసినట్లు ఈడీ పేర్కొంది.