For Money

Business News

హెచ్‌డీఎఫ్‌సీ ట్విన్స్‌ విలీనానికి ఓకే

హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ విలీనానికి కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) ఆమోదం తెలిపింది. ఈ విలీన ప్రతిపాదనకు హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ బోర్డులు ఏప్రిల్‌ నెలలో ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. వివిధ నియంత్రణ సంస్థల నుంచి అనుమతుల కోసం దరఖాస్తు చేశాయి. ఈ విలీనానికి భారత రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) గత నెలలోనే ఆమోదం తెలిపింది. ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈల నుంచి కూడా ఈ విలీనానికి ఆమోదం ఇది వరకే వచ్చింది.